శ్రియ ‘గమనం’…

2001లో వచ్చిన ‘ఇష్టం’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల నటి శ్రియ. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. తెలుగు, హిందీ, తమిళ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకుంది. కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం కాకుండా… నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా నటించి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

ఇదిలా ఉంటే శుక్రవారం శ్రియ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆమె తాజాగా నటిస్తున్న ‘గమనం’ చిత్ర యూనిట్… సినిమాలోని శ్రియ పాత్రను పరిచయం చేసింది. ‘గమనం’ ఫస్ట్ లుక్ ను దర్శకుడు క్రిష్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ… చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇక ఈ ఫస్ట్ లుక్ లో శ్రియ  మునుపెన్నడూ కనిపించని విధంగా ఉంది. చీరకట్టులో, పెద్దగా మేకప్ లేకుండా ఒక సాధారణ గృహిణిలా కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో శ్రియ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో  ఏకకాలంలో తెరకెక్కిస్తుండడం విశేషం. తాజాగా 38వ పడిలోకి అడుగుపెట్టిన శ్రియ ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనమూ కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here