ఆ స‌మ‌యంలో హీరోలు ఏం చేశారో చెప్పిన హీరోయిన్ తాప్సీ..

సినిమా ఇండ‌స్ట్రీలో అవ‌మానాలు జ‌రిగాయ‌ని చెబుతున్న మాట‌లు ఇటీవ‌ల ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ప్ర‌ముఖ హీరోయిన్ తాప్సీ కూడా చేరిపోయింది. ఇండ‌స్ట్రీలో త‌న‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయో ఆమె తెలిపింది.

తాను సినిమాల్లోకి వ‌చ్చిన మొద‌ట్లో అందం విష‌యంలో చాలా అవ‌మానాలు ఎదుర‌య్యాయ‌ని తాప్సీ చెప్పింది. ఓ ఇంగ్లీషు మీడియాతో మాట్లాడిన స‌మ‌యంలో తాప్సీ ఈ వివ‌రాలు వెల్ల‌డించింది. కొంత మంది హీరోల భార్య‌లు తాను అందంగా లేన‌ని ఇష్ట‌ప‌డేవారు కాద‌ని తెలిపింది. దీంతో త‌న స్థానంలో వేరే హీరోయిన్ల‌కు అవ‌కాశాలు ఇప్పించార‌ని చెప్పింది. అయితే హీరోల భార్య‌లే కాకుండా ప‌లువురు నిర్మాత‌లు కూడా హీరోయిన్‌గా తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేద‌ని తెలిపింది. ఇక, ఒక సినిమాలో హీరో ఇంట్రడక్షన్‌ సీన్ కంటే నా ఇంట్రడక్షన్‌ సీన్‌ బాగా వచ్చిందని. దాంతో డైరెక్టర్‌కు చెప్పి ఆ హీరో నా సీన్‌ను మార్చేశాడని చెప్పింది. మొత్తానికి తాప్సీ త‌న‌కు ఎదురైన అనుభ‌వాలు బ‌య‌ట‌కు చెప్ప‌డంతో ఇండ‌స్ట్రీ గురించి సినీ అభిమానుల్లో మ‌రోసారి చ‌ర్చ మొద‌లైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here