చిరు ని మరో దాసరి చేస్తున్న తమ్మారెడ్డి ..

తెలుగు ఇండస్ట్రీకి ఒకప్పుడు పెద్ద దిక్కు దాసరి నారాయణరావు . ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుండి ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొన్నాడు ఆయన . ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన నాయకుడి  మ‌ర‌ణం ప‌రిశ్ర‌మ‌ను ఎన్నో విధాలుగా కృంగ‌దీసింది. ముఖ్యంగా చిత్ర‌సీమ త‌న నాయ‌కుడ్ని కోల్పోయిన‌ట్టు అయింది .అయితే ఈ క్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టించాయి తెలుగు ఇండస్ట్రీలో.. ఆయన రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయి .. దాస‌రికి చిరంజీవి రూపంలో ఓ ప్ర‌త్యామ్నాయం క‌నిపిస్తోంది అంటున్నారు ఆయన .

దాస‌రిలా చొర‌వ తీసుకుని, అంద‌రినీ క‌లుపుకుపోయే గుణం, నైజం చిరంజీవి లో  ద‌ర్శ‌న మిస్తున్నాయి. దాస‌రిలా చిరులోనూ నాయ‌కుడున్నాడ‌నిపిస్తోంది అనేది ఆయన వాదన .ఒకప్పుడు తమ్మారెడ్డి చాలాసార్లు చిరంజీవిని విమర్శించడానికి మైకులు పట్టుకున్నాడు. అలాంటి తమ్మారెడ్డి భరద్వాజ్ చిరంజీవి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం  అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈమ‌ధ్య కొన్ని చిన్న సినిమాల‌కు చిరు ముఖ్య అతిథిగా వ‌చ్చి ఆశీర్వ‌దించాడు.

దర్శకరత్న దాసరి నారాయణరావు కూడాఅప్పట్లోచిన్న సినిమాలకు అండగా ఉండే వాడు.అలాగే పాత్రికేయుడు  ప‌సుపులేటి రామారావు దాస‌రిపై రాసిన `తెర వెనుక దాస‌రి` చిరు చేతుల మీదుగానే విడుద‌లైంది. అంతే కాదు, ఆ ఫంక్ష‌న్ కి అయిన ఖ‌ర్చంతా చిరునే భ‌రించి – ఒక్క‌సారిగా దాస‌రిని గుర్తు చేసుకునేలా చేశాడు.దాసరి నారాయణ రావు కూడా అందరిని కలుపుకుని పోయే మనిషి ఇప్పుడు అదే వ్యక్తిత్వం చిరంజీవి లో కనిపిస్తుందన్నది అనేది తమ్మారెడ్డి మాట ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here