పవన్ కళ్యాణ్ ని తెలివిగా తొక్కెస్తున్న కెసిఆర్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు ఉంటుందని పార్టీ ఆవిర్భవించిన రోజులలో  స్పష్టం చేశాడు.అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోచురుకుగా ఉంటున్న తన పార్టీ కార్యకలాపాలను…ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ అడుగుపెట్టాలని భావించింది ఈ క్రమంలోఇటీవల ఆత్మహత్య చేసుకున్ననిరుద్యోగ యువకుడు మురళి కుటుంబాన్ని పరామర్శించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాడు….ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ తను తాజాగా పర్యటించిన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తావించాడు.

ఈ క్రమంలో పవన్ తన తెలంగాణ పర్యటన గురించి తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం తెలియజేశాడు.. అయితే దీనికి ప్రతిస్పందనగా తెలంగాణ పోలీసులు తాజాగా స్పందించారు . పవన్ పర్యటనకు అవసరమైన బందోబస్తు తాము చేయలేమని, ప్రస్తుతం అయిదారుగురు మించి పోలీసులను కూడా పవన్ సెక్యూరిటీకి కేటాయించలేమని చెప్పేశారు.దీంతో పవన్ కళ్యాణ్ తన గజ్వల్ పర్యటన తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేసుకున్నారు.

ఈ విషయంలో జనసేన ఒకటి తలిస్తే కెసిఆర్  మరొకటి తలిచారు ఈ చర్యలను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ హడావిడి తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదనే భావన  కెసిఆర్ కి మనసులో ..  ఉన్నట్టు అర్థమౌతుంది.ప్రస్తుత కేసీఆర్ చర్యలను బట్టి రాజకీయ విశ్లేషకులుతెలంగాణ లో పవన్ పార్టీ వేళ్లూనుకోవడం అంత ఈజీ కాదని తేల్చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here