రెండొందల కోట్లు రాకపోతే అజ్ఞాత వాసి కథ ముగిసిపోతుంది ?

పవన్ కళ్యాణ్  తాజా చిత్రం అజ్ఞాతవాసి విడుదల అవ్వక ముందే 147 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది .. దీంతో ఈ చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా  నిలిచింది విడుదల కాకముందే ఈ రేంజిలో బిజినెస్ దూసుకెళ్తుంటే విడుదలయ్యాక ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో అని  ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యానికి గురి అవుతున్నాయి . ఈ క్రమంలో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కలయిక అప్పట్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి రాబడిని అందించాయి…. దీంతో అజ్ఞాతవాసి మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాగైనా పవన్ కళ్యాణ్ తో  హ్యాట్రిక్ కొట్టాలని కసి మీద ఉన్నాడు . సినిమాలో పవన్ కళ్యాణ్ లూక్స్  కూడా అడిరిపోవడం ఇవాళ విడుదల అయిన టీజర్ సైతం బ్లాక్ బస్టర్ టాక్ రావడం తో బిజినెస్ ఆకాశానికి వెళుతోంది అంటునారు.  సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ  సినిమా కి మంచి  పాటలు అందించాడు.దీన్నిబట్టి అజ్ఞాతవాసి ప్రీరిలీజ్ బిజినెస్ ని ఒక రేంజ్  తీసుకెళ్లాయి అంటున్నారు ట్రేడ్ వర్గాలు.. ఇకపోతే147 కోట్ల బిజినెస్ లాభాల బాట పట్టాలంటే కనీసం 200 కోట్లు కలక్షన్ రావాలి మరి ఇప్పుడు పవన్ స్టామినా ఆ 200 కోట్లు కలెక్ట్ చేస్తుందాలేదా అనేదిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here