కాస్తంత ఒళ్ళు పెరిగిన హీరోయిన్ జిమ్ లో కష్టపడుతోంది ..

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ఆలియా బట్ జిమ్ లో వర్క్ అవుట్ లు తో ఎంతో కష్టపడుతూ తన అందని కాపాడుకుంటూ,అలాగే తనకున్న స్టార్ డామ్ ఇండస్ట్రీ లో నిలుపుకోవాలని సాధన చేస్తోంది …ఆమె వెనుక ప్ర‌తిష్ఠాత్మ‌క య‌శ్‌రాజ్ బ్యాన‌ర్ అలాగే,  భ‌ట్స్ వార‌స‌త్వ బ‌లం ఉన్నా కూడా అలియా మాత్రం తనకంటూ ప్రత్యేకమైన చరిష్మా ఇండస్ట్రీలో ఉండాలని ఆశ పడుతూ ఉంటుంది .. ఇక కథానాయికగా ఇండస్ట్రీలో దూసుకెళ్లి పోవాలంటే తనకున్న అందాన్ని శరీరాన్ని కాపాడుకోవాలని జిమ్లకు వెళ్లి తీవ్రంగా కసరత్తులు చేస్తోంది.

తన శరీరాన్ని మంచి  అందంతో, అలాగే అందమైన ఆకృతి తో విల్లులా సిద్ధం చేస్తోంది.ప్రస్తుతం ఆలియాభట్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ క్రమం లో  ఒక సినిమా వచ్చే వేసవిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.మిగతా రెండు సినిమాలు కూడా చాలా పెద్ద ప్రాజెక్టులుఈ సినిమాల కోసం ఆలియా చాలా తీవ్రంగానే శ్ర‌మిస్తోంది. క‌ష్టే ఫ‌లి అన్నారు పెద్ద‌లు.. అదే తీరుగా చ‌క్క‌ని ఫ‌లితం అందుకుంటుందేమో చూడాలి.రీసెంట్ గా కాస్త బొద్దుగా అవడం మొదలు పెట్టిన అలియా నెమ్మదిగా ఒళ్ళు తగ్గే ప్రయత్నాలు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here