‘ మార్చ్ లో తెలుగు సినిమా షట్ డౌన్ ‘ ఇది అసలు జరిగే పనే కాదు !!

తెలుగు సినీరంగానికి షాకిచ్చే న్యూస్ మొన్ననే బయటకి వచ్చింది .  మార్చి 1 నుంచి సినిమా హాల్స్ షూటింగ్ లు  మూసివేయాలని డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీర్మానించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలుమొత్తం థియేటర్ల సంఖ్య1800. ఈ క్రమంలోథియేటర్ల మూసివేస్తేదాని పై ఆధారపడి బతుకుతున్నకుటుంబాలు ఏమవుతాయో ఆలోచించాలి…అయితే ఇది సాధ్య‌మ‌య్యే ప‌నేనా?? లేదంటే చిత్ర‌సీమ ఇదేదో వార్నింగ్ ఇచ్చి భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

అసలు సమస్యఎందుకు వచ్చిందంటే ప్రింట్  సిస్టం నుంచి డిజిటల్  వ్యవస్థకి మారాక యూ ఎఫ్ వో, క్యూబ్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇటువంటి టెక్నాలజీని ఏర్పాటు చేసుకొనే స్థోమత ధియేటర్ యజమానులకు లేకుండా పోయింది.    దీంతో సర్వీస్ ప్రొవైడర్లు రంగంలోకి దిగియు.ఎఫ్.ఒ సర్వీసుల నుంచి అందుకు కొంత మొత్తం అడ్డగా సేకరించడం మొదలు పెట్టారు…అప్పుడు ఆ అద్దె డబ్బులు నిర్మాతలు చెల్లించాల్సి వస్తుంది.

ఇంతమొత్తం డబ్బుల్ని మేం చెల్లించలేమని  అంటూ నిర్మాతలు చెబుతున్నారు . దీంతో స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ను ఈ రంగం నుంచి ప‌క్క‌కు త‌ప్పించాల‌న్న‌ది నిర్మాతల మండ‌లి ఆలోచ‌న‌. ఈ క్రమంలో ధియేటర్ మూసివేస్తే సర్వీస్ ప్రొవైడర్లకు రాబడి ఉండదు, దాంతో వాళ్లే మన కాళ్ళ దగ్గరకు  దిగివస్తారని నిర్మాతల మండలి వ్యూహం… అయితే ఈ బంద్ కార్యక్రమం వేసవి సీజన్లో అంటే నిర్మాతల మండలి కొంత ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే ఈ సీజన్లోనే ఇండస్ట్రీకి  రాబడి వచ్చేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here