టబు స్థానంలో మిల్కీ బ్యూటీ..

నితిన్ హీరోగా బాలీవుడ్ లో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న ‘అంధాదున్‌’ తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హిందీలో ఆయుష్మాన్ ఖురానా నటించిన పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కానుంది.

అయితే హిందీ చిత్రంలో టబూ పోషించిన పాత్రను  తెలుగులో ఎవరు పోషించనున్నారని.. గత కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేశాయి. అయితే తాజాగా ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించింది. సినిమాకి ఎంతో కీలకమైన ఈ పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇక ఈ చిత్రంలో రాధిక ఆప్టే స్థానంలో నభా నటేష్ నటిస్తోంది. సాగర్ మహతి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు హరి కె.వేదాంత్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here