కరోనా వైరస్‌ మాత్రమే.. డైనోసార్‌ కాదు!

కరోనా మహమ్మారి విజృంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు 5 నెలల లాక్‌ డౌన్‌ తర్వాత ప్రజలు మళ్లీ ఎప్పటిలాగా తమ కార్యక్రమాల్లో, వృత్తుల్లో బిజీగా మారిపోతున్నారు. సమాజంలో కరోనా ఉంది అని తెలుసి కూడా తమ జాగ్రత్తలు తాము పాటిస్తూ బతుకు బండిని నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా తారలు కూడా తమ సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిబంధనలను అనుసరించి, తగు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌ జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అందాల తార తాప్సీ కూడా షూటింగ్‌లో పాల్గొంది. తమిళంలో నటిస్తోన్న ‘అన్నాబెల్లె’ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసింది.

కరోనా గురించి ఆలోచించడం మానేసి, మన పనులు మొదలుపెట్టాలని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఈ విషయమై తాప్సీ మాట్లాడుతూ.. ‘ఎక్కడో ఓ చోట, ఎప్పుడో ఒకప్పుడు మొదలు పెట్టాల్సిందే కదా అనుకుంటూ సెట్‌కి వెళ్లడానికి ముందే మన మైండ్‌ని సిద్ధం చేసుకోవాలి. తలుపులన్నీ మూసేసుకుని ఇంట్లో కూర్చోవడానికి అది వైరస్‌ మాత్రమే.. డైనోసార్‌ కాదు. మంచి ఆహారపు అలవాట్లు, పరిశుభ్రత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడమే మనం చేయాల్సిన పని. అతి తక్కువమంది టీమ్‌తో మా ‘అన్నాబెల్లె’ చిత్రీకరణను పూర్తి చేశాం’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

ఇక తాప్సీ ఇటీవల మాల్దీవుల్లో హాలీడే ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాప్సీ తన బాయ్‌ ఫ్రెండ్‌తో టూర్‌కు వెళ్లిందని, త్వరలోనే వివాహం చేసుకుందని వార్తలు వచ్చాయి. ఇక తాప్సీతో మాథ్యుస్‌ బోయే దిగిన ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారిన విషయం విధితమే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here