భారీ మల్టీ స్టారర్ కు తెర తీస్తోన్న సురేశ్ బాబు..? 

ఇటీవల మల్టీ స్టారర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు కలిసి నటిస్తే ఆ సందడే వేరు…  తాజాగా ఇలాంటి ఓ భారీ మల్టీ స్టారర్ చిత్రానికి రంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని, రానా కాంబినేషన్ లో ఓ సినిమా రానుందనే వార్త టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ప్ర‌ముఖ నిర్మాత ఈ ఇద్ద‌రు న‌టుల‌తో క‌లిసి మల్టీస్టార‌ర్ ను తెర‌కెక్కించాలని భావిస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మించ‌నున్న ఈ సినిమా కోసం ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కథను సిద్దం చేసే ప‌నిలో ఉన్నాడ‌ని తెలుస్తోంది. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా రానున్న‌ట్టు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం నాని ‘టక్ జగదీశ్’ చిత్రంలో నటిస్తుండగా… రానా ‘విరాటపర్వం’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది, దర్శకుడు ఎవరు అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here