బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి..

శ్రీరెడ్డి.. ఈ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు నిత్యం కాంట్రవర్సీలతో సావాసం చేసే ఈ బ్యూటీ…  ఏదో ఒక చర్చతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇక గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలతో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.

గతంలో హీరోలు, హీరోయిన్లను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షోపై పడింది. బిగ్ బాస్  ఇంటిలో జరిగేదంతా స్క్రిప్టు ప్రకారమే జరుగుతుందంటూ కుండ బద్దలు కొట్టింది. ఇక షోలో  ఎవరైనా ఏడిచినా కూడా అన్నీ దొంగ ఏడుపులే కానీ నిజం మాత్రం కాదని చెప్పింది శ్రీ రెడ్డి. తనకు అవకాశం ఇస్తే మాత్రం అసలు రియాలిటీ ఏంటో చూపించేదన్నంటూ వ్యాఖ్యలు చేసింది. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ 2లో శ్రీ రెడ్డి పాల్గొననుందని అప్పట్లో వార్తలు వచ్చాయి, కానీ అవన్నీ పుకార్లే అని తేలాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here