మరో భారీ ఆఫర్ కొట్టేసిన ‘చందమామ’..

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 16 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది నటి కాజల్ అగర్వాల్. 35 ఏళ్ల వయసులోనూ బడా హీరోల సరసన నటించే అవకాశాల్ని సొంతం చేసుకుంటోంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం చేతిలో ఏకంగా 6 సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోన్న చిన్నది తాజాగా మరో భారీ అవకాశాన్ని కొట్టేసింది.

సూర్య హీరోగా హరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన  ‘సింగం, ఆరు, వేల్’ లాంటి సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇలాంటి క్రేజీ సినిమాలో కాజల్ అవకాశం దక్కించుకోవడం విశేషం. మరికొన్ని రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here