అది ఈజీ అని ఎవరన్నారు..?

హిందీ బిగ్ బాస్ ద్వారా సినీ ప్రేక్షకులకు పరిచయమైంది పోర్న్ స్టార్ సన్నీ లియోనీ. అనంతరం హిందీతో పాటు పలు ఇతర భాషల్లోనూ తళుక్కుమందీ బ్యూటీ. వైపు సినిమాలతో బిజీగా గడిపే చిన్నది మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.

ప్రస్తుతం కుటుంబ సభ్యులతో అమెరికాలో  జాలీగా గడుపుతోన్న ముద్దుగుమ్మ…  అక్కడి ఆనంద క్షణాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది.
క్రమంలోనే సన్నీ తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన వీడియో ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. తన వర్కవుట్కు సంబంధించిన ఫన్నీ వీడియోను పోస్ట్ చేసింది. `కొత్త విషయాలను ప్రయత్నించడం సులభమని ఎవరు చెప్పారు. నేను ప్రయత్నించాను.. ఇక, నన్ను చూసి నవ్వడం ఆపండి` అంటూ ఫన్నీగా క్యాప్షన్ ను జోడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here