తొలిసారి నటన ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోన్న రష్మిక.. !

కన్నడలో వచ్చిన ‘కిర్రిక్ పార్టీ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది అందాల తార రష్మిక మందన. ఇక తెలుగులో ‘ఛలో ‘తో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకునే బ్యూటీ ఇప్పటి వరకు పెద్దగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో మాత్రం నటించలేదనే చెప్పాలి.

అయితే తాజాగా రష్మికకు ఈ లోటును తీర్చుకునే అవకాశం లభించింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రష్మిక బన్నీకి జోడిగా నటిస్తోంది.  ఈ  సినిమాలో రష్మిక ఓ గిరిజన యువతి పాత్రలో నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో తొలిసారి నటన ప్రాధాన్యత ఉన్న పాత్రలో రష్మిక నటించనున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతోనైనా రష్మిక గ్లామర్ డాల్ అనే ముద్రను పోగొట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here