విడుదలకు ముందే రికార్డులు తిరగరాస్తున్న ‘సర్కారు వారి పాట’..

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్  సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ నటించనున్నాడనే వార్త.. ఆయన అభిమానుల్లో జోష్ నింపింది. ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది.

ఇదిలా ఉంటే ఇంకా షూటింగ్ పూర్తిచేసుకోని ఈ సినిమా రికార్డులను తిరిగి రాసే పనిలో పడింది.

ఈ సినిమా తెలుగు డిజిటల్ తో పాటు శాటిలైట్ హక్కులను  భారీ ధరకు విక్రయించారని తెలుస్తోంది. దీనికోసం రూ.  35 కోట్లు చెల్లించేందుకు ప్రముఖ సంస్థ సిద్ధమైందని సమాచారం. ఒకవేళ ఈ వార్తే గనుక నిజమైతే… మహేష్ బాబు సరికొత్త రికార్డులకు తెరలేపుతున్నట్లే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూడా నటించనున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరి విడుదలకు ముందే ఈ సినిమా ఇలా రికార్డులు తిరగ రాస్తుంటే..  థియేటర్ల లోకి వచ్చిన తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here