‘యుద్ధానికి’ సిద్ధమవుతోన్న నారా రోహిత్..?

కెరీర్ తొలినాళ్ల నుంచి వైవిధ్యభరితమైన పాత్రలను  ఎంచుకుంటూ.. తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు నారా రోహిత్. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండే రోహిత్.. ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తాడు.
ఇదిలా ఉంటే రోహిత్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఫోటో తన తదుపరి చిత్రంపై ఆసక్తిని పెంచేసింది. పూర్తిగా గడ్డం లుక్ లో ఉన్న రోహిత్ ఫోటో ఆకట్టుకుంటోంది.
అయితే కొత్త లుక్ రోహిత్ కొత్త సినిమా కోసమని తెలుస్తోంది. బాణం చిత్రం దర్శకుడు చెైతన్య దంతులూరి దర్శకత్వంలో 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ చిత్రంలో నారా రోహిత్ నటించనున్నాడని సమాచారం. వచ్చే నవంబర్ నుంచి సినిమా చిత్రీకరణ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://www.instagram.com/p/CFHGH2pg7tq/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here