హీరో సూర్యపై కోర్టు ధిక్క‌ర‌ణ ఫిర్యాదు.. ఇంతకీ సూర్య ఏం చేశాడంటే.!

ఓ వైపు కరోనా విజృంభణ తారా స్థాయిలో ఉన్న సమయంలోనే దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో తమిళనాడులో ఒత్తిడి, భయం కారణంతో ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఈ ఘటనపై తీవ్ర కలతకు గురైన తమిళ హీరో సూర్య పలు సెన్సేషన్ వ్యాఖ్యలు చేశాడు. కరోనా భయంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయ విచార‌ణ‌లు చేస్తున్న గౌరవ న్యాయమూర్తులు … విద్యార్థులను మాత్రం భయం లేకుండా నీట్ పరీక్షకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేయడం విడ్డూరమని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

దీంతో దేశంలోని న్యాయ‌మూర్తుల‌ను, న్యాయ వ్య‌వ‌స్థ‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడి త‌మిళ హీరో సూర్య‌ కోర్టు ధిక్క‌ర‌ణకు పాల్ప‌డ్డారంటూ చెన్నై హైకోర్టు న్యాయ‌మూర్తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు సూర్య‌పై కోర్టు ధిక్కార‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి న్యాయ‌మూర్తి ఎస్ఎం సుబ్ర‌మ‌ణ్యం లేఖ రాశారు. మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here