చిరు గుండు నిజం కాదు… కావాలంటే మీరే చూడండి!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల చిరు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. గుండు లుక్ లో కనిపించిన చిరు అందరినీ షాక్ కి గురిచేశాడు. అయితే ఇది నిజమైన గుండేనా లేదా…  ఏదైనా గ్రాఫిక్స్ తో ఇలా క్రియేట్ చేశారా?  అని ప్రశ్నలు అభిమానులను వేదించాయి.  అయితే ఈ ప్రశ్నలన్నింటికీ చెక్ పెడుతూ…  తాజాగా చిరు ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
తన గుండు వెనక ఉన్న రహస్యాన్ని బయటపెడుతూ…  ‘మేకింగ్ ఆఫ్ అర్బన్ మాంక్’ అంటూ తన కొత్త లుక్ ఎలా సాధ్యమైందో తెలిపే వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో చుసినవారు ఇదంతా మేకప్ మాయేనా అని నివ్వెరపోతున్నారు. ఇదిలా ఉంటే చిరు ‘ఆచార్య’తో పాటు ‘లూసిఫర్’, ‘వేదాళం’ రీమేక్ ల్లోనూ నటించనున్న విషయం తెలిసిందే. మరి ఈ గుండు మేకప్ ఎందుకోసమనేది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here