జనగణమన రచ్చ ఇక ఆగేది ఎన్నడు ?

జనగణమన  వేడి ఇంకా చల్లారినట్టు కనపడ్డం లేదు . దీన్ని ర‌ద్దు చేయాల‌ని సుప్రీం కోర్టులో పిటీష‌న్లు వేస్తూనే ఉన్నారు. దీనిపై స‌ర్వోన్న‌త న్యాయ స్థానం కూడా స్పందించింది. సినిమాకి కేవ‌లం వినోదం కోస‌మే వెళ్తార‌ని, అక్క‌డ జాతీయ గీతం ప్ర‌స్తావ‌న తీసుకురావ‌ల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పింది. క్రీడా సంరంభాల్లో ఎలాగూ.. జాతీయ గీతాన్ని ఆల‌పిస్తున్నారు క‌దా, థియేట‌ర్ల‌లో ఎందుకు అని ప్ర‌శ్నించింది.

గీతం ఆలపిస్తున్న టైం లో ఆ గీతానికి ఉన్న ప్రాధాన్యత , గొప్పతనం ముఖ్యంగా అర్ధం కూడా తెలీని టైం లో ఇలా బలవంతంగా గీతం తప్పనిసరి చెయ్యాల్సిన పనేంటి అంటూ సుప్రీం కేంద్రాన్ని ప్రశ్నించింది. జాతీయ గీతాన్ని ఆల‌పిస్తేనే దేశ‌భ‌క్తి ఉన్న‌ట్టా?? దేశం మీద ప్రేమ అనేది స్వ‌త‌హాగా పుట్టాల్సిందే, దాన్ని బ‌ల‌వంతంగా రుద్ద‌లేం అని సుప్రీం తేల్చి చెప్పింది.

ఈ విష‌య‌మై పున‌రాలోచించాల‌ని, లేదంటే.. క‌నీసం స‌వ‌ర‌ణ అయినా తీసుకురావాల‌ని కేంద్రానికి ఆదేశించింది. ఇక మీద‌ట థియేట‌ర్ల‌లో జాతీయ గీతం ప్ర‌ద‌ర్శించినా, ఆ స‌మ‌యంలో లేచి నిల‌బ‌డాలా, వ‌ద్దా? అనేది ప్రేక్ష‌కుల ఇష్టానికి వ‌దిలేసే అవ‌కాశాలున్నాయి. మ‌రి కేంద్రం నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి.

మోడీ ప్రభుత్వం జనాలలో దేశభక్తి పెంచే ప్రోగ్రాం గట్టిగానే పెట్టుకుంది. ఎక్కడా ఎలాంటి పరిస్థితి లో జనాలు ఒక గుంపుగా దొరుకుతారో అలాంటి చోట వారికి దేశభక్తి ఇనుమడింప జేయ్యాలి అనేది మోడీ ఆలోచన. ఆలోచన మంచిదే కానీ ఫ్యామిలీ తో షా సరదాగా సినిమాకి వచ్చి సినిమా చూడాలి అనుకుంటున్న టైం లో ఈ గోల ఏంటి అనుకోనివారు కూడా లేకపోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here