లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ కంటే ముందే ఇతన్నే పెళ్లి చేసుకుంది

లక్ష్మీ పార్వతి రచయిత మాత్రమే కాదు హరికథా కళాకారిణి , తెలుగు లిటరేచర్ లో డాక్టరేట్ కూడా ఉంది ఆమెకి. సమాజిక స్పృహ, రాజకీయ చైతన్య కూడా ఎక్కువగా కలిగిన వ్యక్తి ఆమె. మేజర్ చంద్రకాంత్ సినిమా వేడుకలో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు ఎన్టీఆర్ ప్రకటించారు.

1993లో ఎన్టీఆర్‌ని ఆమె రెండో వివాహం చేసుకున్న తర్వాత ఆమె మొదటి భర్త, హరికథా కళాకారుడైన వీరగంధం సుబ్బారావు నానా హడావుడి చేశాడు. తాను తన భార్యను ఎంతో బాగా చూసుకుంటానని కానీ తన భార్యను ఎన్టీఆర్‌ వలలో వేసుకున్నాడని, ఇప్పుడు తనకు భార్య, తన బిడ్డకు తల్లిని లేకుండా చేసింది ఎన్టీఆరేనని ఆరోపించి, ఎన్టీఆర్‌పై విమర్శలు గుప్పించాడు.

అదే ఆరోపణలు మీడియా ముందు కూడా చేశాడు. ఇక తెరమరుగైపోయిందనుకున్న ఈ తేనెతుట్టెను లక్ష్మీపార్వతినే మరలా కలబెట్టడం విశేషం. ” అనుకోని పరిస్థితి లో నా మొదటి పెళ్లి జరిగింది. అస్సలు ఇష్టం లేకుండానే ఆ పెళ్లి చేసుకున్నాను నేను. అమ్మానాన్న కి కూడా ఆ పెళ్లి ఇష్టం లేదు. మాకు కొడుకు పుట్టిన తరవాత మేము భార్యా భర్తలుగా లేకుండా పోయాము.

నేను ఆ తరవాత కాలం లో ఆధ్యాత్మిక చింతన లోకి వెళ్ళిపోయాను, ఎన్టీఆర్ జీవితం లో ఆ తరవాత ఎప్పుడో అడుగు పెట్టాను. అలా అడుగు పెట్టినందుకు నా మీద అప్పట్లో విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఏవీ నేను పట్టించుకోలేదు. ” అన్నారు ఆమె. ఆమె మొదటి పెళ్లి గురించి ఈ మధ్య కాలం లో ఎప్పుడూ చెప్పని ఆమె లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రానున్న నేపధ్యం లో మళ్ళీ ఆ విషయాలు చెప్పడం వింతగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here