త్రివిక్రమ్ పుట్టినరోజు నాడు పవర్ స్టార్ ఫాన్స్ కి పండగ :

త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాత వాసి సినిమా కి ఇంకా టైటిల్ ఫిక్స్ అవలేదు. PSPK25 అని అఫీషియల్ గా చెబుతున్నారు అజ్ఞాతవాసి అని ఫాన్స్ అనుకుంటున్నారు తప్ప అధికారికంగా ఇప్పటి వరకూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేనేలేదు. అయితే ఈ సినిమా కి కాన్సెప్ట్ పోస్టర్ వచ్చింది కానీ టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ రాలేదు.

ఫస్టులుక్ దసరాకు వస్తుందనీ .. దీపావళికి వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూశారుగానీ, అలాంటి ప్రయత్నాలేవీ జరగలేదు. ఇక వచ్చేనెల 7వ తేదీన త్రివిక్రమ్ పుట్టినరోజు కావడం వలన, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారనేది తాజా సమాచారం. పవన్ సరసన కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9వ తేదీ .. సెకండ్ షో నుంచి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here