వెంకటేష్ ఐడియా తో గురు కి సూపర్ లాభాలు

రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల అయిన కాటమరాయుడు సినిమా గత వారం సరైన రిజల్ట్ ని ఇవ్వలేదు. పవన్ క్రేజ్ కోసం జనం థియేటర్ లకి ఎగబడ్డారు కానీ సినిమాలో విషయం లేకపోయేసరికి ఏ సినిమా వస్తుందా అని కాచుకుని కూర్చున్నారు. అదే టైం లో వచ్చిన గురు చిత్రం అందరికీ విపరీతంగా నచ్చేసింది.

బాబు బంగారం తరవాత వెంకటేష్ చేసిన సినిమా ఇదే అవ్వడం తో దృశ్యం రేంజ్ లో ఈ చిత్రం అందరికీ నచ్చేసింది. ఈ సినిమాకి అన్నింటా పాజిటివ్ టాక్ నడుస్తోంది. శని ఆది వారాలలో వసూళ్లు అదిరిపోతున్నాయి. దాదాపు పన్నెండు కోట్ల వరకూ షేర్ వసూలు చెయ్యచ్చు అని టాక్ వినిపిస్తోంది, మొదటి రోజునే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండున్నర కోట్లు దాకా రాబట్టింది.

వెంకటేష్ కి ఉన్న మార్కెట్ ని బట్టీ ఇతరత్రా విషయాలు కన్సిడర్ చేస్తే ఈ కలక్షన్ లు చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఇలాంటి సినిమాలకి వెంకటేష్‌ పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకోవడం నిర్మాతలకి కలిసి వస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here