గుడ్ న్యూస్ .. కమీడియన్ గా సునీల్ రీ ఎంట్రీ , సినిమా ఇదే

హీరోగా కంటే కూడా కమీడియన్ గానే సునీల్ ని ఎక్కువ మంది ఇష్టపడతారు. మర్యాద రామన్న లాంటి హిట్లు అతని ఖాతాలో ఉన్నా సరే కమెడియన్ గా నే నువ్వు బెటర్ అని అప్పట్లోనే చాలామంది విశ్లేషకులు కూడా సునీల్ తో చెప్పారు. అయితే కమీడియన్ కేరేర్ గురించి పట్టించుకోని సునీల్ ఎక్కువగా కామెడీ సినిమాలలో హీరోగా చెయ్యడం మీద దృష్టి పెట్టాడు.. వరసగా సినిమాలు చేస్తూ ఉన్నా ప్లాపులు సునీల్ ని వెక్కిరిస్తున్నాయి. అయితే చివరగా అతను ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం ఒక మీడియా ఇంటర్వ్యూ లో సునీల్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ” నేను సైరా నరసింహా రెడ్డి సినిమాతో కమీడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాను. ఈ సినిమాలో నా ఓన్ స్టైల్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది అదంతా కామెడీ చుట్టూనే తిరుగుతుంది. కొన్ని సెలెక్ట్ చేసుకున్న సినిమాల వరకూ నేను కమెడియన్ గా చేస్తాను మిగితావి మాత్రం హీరోగా చేస్తాను ” అని అన్నాడు సునీల్ మొత్తం మీద , చిరు 151 సినిమాతో కమీడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మనోడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here