వంగవీటి రంగాపై గౌతంరెడ్డి వ్యాఖ‌్యల వెనుక సీక్రెట్‌ ఏంటి?

వంగవీటి రంగాపై గౌతంరెడ్డి వ్యాఖ‌్యల వెనుక సీక్రెట్‌ ఏంటి?…. రంగాపై ఇప్పుడే ఎందుకు వివాదాస్పద కామెంట్స్‌ చేశారు?. రచ్చ అవుతుందని తెలిసినా కాంట్రవర్శీ కామెంట్స్‌ చేశారా? వంగవీటి రాధాకృష్ణతోపాటు మల్లాది విష్ణును కూడా ఎందుకు టార్గెట్‌ చేశారు? అసలు గౌతంరెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు టార్గెట్‌ ఏంటి? 
పక్కా వ్యూహంతోనే వంగవీటి రంగాపై ….గౌతంరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రచ్చ కావాలనే కాంట్రవర్శీ కామెంట్స్‌ చేశాడనే టాక్‌ వినిపిస్తోంది. గౌతం వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం ఉందంటున్నారు. విజయవాడ సెంట్రల్‌ వైసీపీ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి తనను తప్పించడం…. వంగవీటి రాధాకి దాన్ని అప్పగించడంతో గౌతంరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో మల్లాది విష్ణును వైసీపీలో చేర్చుకోవడమే కాకుండా…. 2019లో టికెట్‌ ఖాయమని ప్రచారం జరుగుతుండటంతో…. తనకింకా అవకాశం ఉండదని భావించే…. గౌతంరెడ్డి వ్యూహం మార్చినట్లు చెబుతున్నారు. రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడంతోనే…. పార్టీ మారాలనే ఉద్దేశంతో…. వంగవీటి రాధా టార్గెట్‌గా రంగాపై గౌతంరెడ్డి వివాదాస్పద కామెంట్స్‌ చేసినట్లు తెలుస్తోంది.
 
రాజకీయ దురుద్దేశంతోనే రంగాపై గౌతంరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. ఇంత సడన్ గా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక కుట్ర ఉందన్నారు.
రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గౌతంరెడ్డికి వంగవీటి రాధాకృష్ణ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయాలనుకుంటే చేసుకో…. కానీ రంగా, రాధా జోలికొస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. 
2014లో వైసీపీ తరపున విజయవాడ సెంట్రల్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన గౌతంరెడ్డికి మళ్లీ వైసీపీ నుంచి టికెట్‌ దక్కే అవకాశాలు కనిపించకపోవడంతో…. బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఉద్దేశపూర్వకంగానే వంగవీటి రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here