వంటపాత్రలు కడగడం కూడా ఓ సవాలేనా..?

కరోనా పుణ్యమాని ఎప్పుడూ గజిబిజిగా గందరగోళ జీవితాలతో గడిపే వారంతా ఇంటిపట్టునే ఉంటున్నారు. ఎప్పుడు షాపింగ్ లు, సినిమాలకు వెళ్లేవారు కూడా కరోనా భయంతో ఇంటి గడప దాటట్లేరు దీంతో అందరూ చాలా లోన్లీ గా ఫీల్ అవుతున్నారు. అయితే ఇంటిపట్టునే ఒంటరిగా గడుపుతున్నా తనకు మాత్రం బోర్ కొట్టట్లేదని చెబుతోంది అందాల నటి శృతిహాసన్. విషయమై శృతిహాసన్ మాట్లాడుతూ..’ లాక్డౌన్రోజుల్లో ఇంటిపట్టునే ఒంటరిగా గడుపుతున్నా నాకు బోర్ కొట్టట్లేదు. ఒంటరిగా ఉండడం నాకెంతో ఇష్టం. ఒంటరిగా ఉండడం భయం అని కొందరు చెబుతుంటారు. కాని నేను కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నాను.

చెన్నై ఎప్పుడు వచ్చినా నాన్నను  (కమల్హాసన్‌)ని కలుసుకుంటా తర్వాత ఒంటరిగానే ఉంటా. ఒంటరితం నాకెంతో ఇష్టం. వంట చేయడం, ఇంటిని శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం.. ఇలా అన్ని పనులు నేనే చేసుకుంటా. `సెలబ్రిటీలు వంటపాత్రలు కడుగుతారా?` అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. లాక్డౌన్సమయంలో `వంటపాత్రలు కడిగే పోటీలో పాల్గొంటారా?` అని కొందరు సవాలు విసిరారు. వంటపాత్రలు కడగటం, ఇంటిని శుభ్రపరచడం.. ఒక సవాలా? పనులు అందరూ చేయాల్సినవేన`ని శ్రుతి చెప్పుకొచ్చింది.
ఇక కెరీర్ విషయానికి వస్తే శృతిహాసన్ ప్రస్తుతం తమిళ చిత్రంలాభంలో నటించింది. సినిమా త్వరలోనే విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here