‘మేజర్’లో దబాంగ్ బ్యూటీ..

అడివి శేష్ హీరోగా మేజర్ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మేజర్ చిత్రంలో అడవి శేషు జోడిగా

`ద‌బాంగ్ 3` బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈమె ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె. చేసినవి కొన్ని సినిమాలే అయినా తన అందంతో బాలీవుడ్ ను మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. ఇప్పుడు ‘మేజర్’ ద్వారా తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది.

ఇక మేజర్ సినిమా కథ విషయానికొస్తే.. 2008 ముంబై తీవ్రవాద దాడుల్లో అమ‌రుడైన‌ ఎన్ఎస్‌జీ క‌మాండో సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో, `గూఢ‌చారి` హీరోయిన్ శోభిత ధూళిపాళ మరో ముఖ్య పాత్ర‌లో కనిపించనుంది. ఇప్ప‌టికి 50 శాతానికి పైగా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. 2021 వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here