వైసీపీ గూటికి మ‌రో టిడిపి నేత ఫ్యామిలీ..?  ఏపీలో ఎక్కువైన పార్టీల మార్పులు

ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించి అధికారం చేప‌ట్టిన వైసీపీ ఇప్పుడు దూకుడు పెంచింది. ఒక‌వైపు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పార్టీ చ‌తికిల‌ప‌డిపోవ‌డం కూడా వైసీపీకి బాగా ప్ల‌స్ అవుతోంది. ఇప్పుడు ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను ఆక‌ర్షించే ప‌నిలో వైసీపీ జోరుగు ముంద‌కు పోతోంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంది.

రాష్ట్రంలో భారీ మెజార్టీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన వై.ఎస్ జ‌గ‌న్ ఇప్పుడు పాల‌న‌లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇదే స‌మ‌యంలోనే పార్టీని కూడా ఆయ‌న మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని చూస్తున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపికి బ‌లం ఉంది. అక్క‌డ‌క్క‌డా అడ‌దాద‌డ‌పా త‌ప్పితే రాష్ట్రం మొత్తం వైసీపీ బలం పెరుగుతోంద‌ని చెప్పాలి. ఈ ప‌రిస్థితుల్లో పార్టీపై జ‌గ‌న్ మ‌రింత ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

మొన్న టిడిపికి చెందిన విశాఖ ద‌క్షిణ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ వైసీపీకి స‌పోర్టు చేస్తూ జ‌గ‌న్‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న త‌న కుమారుడిని పార్టీలోకి చేర్చించారు కూడా. ఆ త‌ర్వాత మీడియా స‌మావేశం ఏర్పాటుచేసి మ‌రీ చంద్ర‌బాబును తిట్టారు. రాష్ట్రంలో ఎన్న‌డూ లేని అభివృద్ధి జ‌గ‌న్ చేస్తున్నార‌ని కొనియాడారు. ఇన్నాళ్లూ చంద్ర‌బాబు ద‌గ్గ‌ర బ‌ల‌వంతంగా ఉన్న‌ట్లు చెప్పుకొచ్చారు. విశాఖ అభివృద్ధి చెందుతోంద‌ని.. జ‌గ‌న్ ఇంకా అభివృద్ధి చేస్తార‌న్నారు.

ఇప్పుడు టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు డీకే శ్రీనివాసులు త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుంటారని సమాచారం. సీఎం జగన్ తిరుమల పర్యటనలో ఉండగా శ్రీను కలిశారు. ఆదికేశవులు రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్‌గా, రెండు పర్యాయాలు చిత్తూరు ఎంపీగా పనిచేశారు. 2013లో గుండె సంబధిత వ్యాధితో ఆయన మరణించారు. గత ఎన్నికల్లో మిథున్‌రెడ్డిపై టీడీపీ తరఫున డీకే శ్రీనివాస్‌ తల్లి సత్యప్రభ పోటీ చేశారు. శ్రీనివాసులే పోటీ చేస్తారని అనుకున్నా చివ‌ర‌కు స‌త్య‌ప్ర‌భే పోటీ చేశారు.

ఈ కుటుంబం ఇప్ప‌డు వైసీపీలోకి రాబోతోంద‌న్న ప్ర‌చారం ఊపందుకుంది. అయితే కేవ‌లం అభివృద్ది విష‌యంలో జ‌గ‌న్‌తో మాట్లాడిన‌ట్లు డీకే శ్రీ‌నివాసులు చెబుతున్నారు. రాజ‌కీయాలేవీ మాట్లాడ‌లేద‌న్నారు. మ‌రి ఏం జ‌రుగ‌నుందో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here