శ్రీను వైట్ల కి అంత సీన్ లేదు .. లాసేస్ తప్పవు

ఒకప్పుడు త్రివిక్రమ్ , రాజమౌళి ల పేరు చెప్తే జనాలు ఎలా థియేటర్ కి వస్తారో శ్రీనువైట్ల పేరు చెప్పినా అలాగే వచ్చేవారు. కామెడీ కి యాక్షన్ కీ కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీను వైట్ల తరవాత కాలం లో వరస ప్లాపులతో డుల్ అయిపోయాడు. కామెడీ బ్రహ్మాండంగా చూపించే వైట్ల తన చిత్రాల్లో జోష్ తగ్గించాడు. బ్రూస్ లీ, ఆగాడు సినిమాలు అతని కెరీర్ కి పెద్ద గుది బండలు లాగా తయారు అయ్యాయి. ఆ రెండు చిత్రాలతో ఇండస్ట్రీలో తన పరపతి పోగొట్టుకోవడమే కాకుండా ప్రేక్షకుల నమ్మకాన్ని సైతం అతను కోల్పోయాడు.

ఈ రెండు సినిమాలనీ మర్చిపోయి మిస్టర్ సినిమా ని తీసిన శ్రీను వైట్ల ఓవర్ సీస్ లో ఆడియన్స్ తనని ఇంకా నమ్ముతున్నారు అని అనుకుంటున్నాడు. దానికోసమే మిస్టర్‌కి వందకి పైగా లొకేషన్లలో ప్రీమియర్‌ షోలు కూడా ప్లాన్‌ చేసారు. ఒకపక్క బాహుబలి 2 కోసం ఎదురు చూస్తున్న జనాలు శ్రీను వైట్ల కోసం అంత దూరం ట్రావెల్ చేసి రివ్యూ లు కూడా చూడకుండా, టాక్ తెలీకుండా వస్తారా అంటే డౌటే ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here