భారతీయ సినిమాకి దక్కిన అతిగొప్ప గౌరవం ఇదేనేమో

హాలీవుడ్ సినిమాలని తెలుగు , తమిళం, హిందీ పరిశ్రమ లు సిగ్గు లేకుండా ఫ్రీ మెక్ లు చేసేస్తూ ఉంటారు . మినిమం కూడా ఆ సినిమాలకి సంబంధించి కాపీ రైట్ ల గురించి ఆలోచించరు మనోళ్ళు. శుబ్రంగా సీన్ నచ్చితే , స్టోరీ నచ్చితే లిఫ్ట్ చేసి పారేస్తూ ఉంటారు. ఊపిరి లాంటి బోలెడు సినిమాలు మనం అలాంటి పంథా లోంచే చూసాం. మనం ఎప్పుడూ విదేశీ సినిమాల నుంచి స్ఫూర్తి పొందుతాం కానే మొదటి సారి మన సినిమాని వాళ్ళు కాపీ కొట్టారు.
2009లో అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాని రూపొందించిన ‘3 ఇడియట్స్’ అదే పేరుతో స్పానిష్ భాషలో రీమేక్ కావడం విశేషం. నిర్మాత విధు వినోద్ చోప్రా దగ్గర అధికారికంగా రీమేక్ హక్కులు తీసుకుని మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. ఈ చిత్ర ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. అది చూస్తే మనకు చిత్రమైన అనుభూతి కలగడం ఖాయం. ఇండియన్ స్పెయిన్ సినిమా వారు రీమేక్ చేసారు. ట్రైలర్ లో త్రీ ఇడియట్స్ కనపడుతూ ఉంటే భలే అనిపిస్తుంది ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here