కిమ్ ను చంపేందుకు అమెరికా సైన్యం..? భయపడుతున్న నియంత

ఉత్తర కొరియా అంటే మనకు ముందుకు గుర్తొచ్చేది కిమ్ జాంగ్ ఉన్. అతిపిన్న వయస్సులో దేశాధ్యక్షుడయ్యాడు.నియంతపాలనతో ఇతర దేశాల్ని ముప్పుతిప్పలుపెట్టిస్తున్నాడు. అయినా కిమ్ జాంగ్ మాకు నిజమైన నేత అని అక్కడి ప్రజలు పొగుడుతుంటారు. ఎవరిని ఏం చేసినా సరే తన దేశ ప్రజలు మాత్రం ఇబ్బందులు పడకూడదనే తత్వం కిమ్ జాంగ్. అందుకే ఈ నియంతను కాపాడుకోవడానికి ఆ దేశ ప్రజలు, మీడియా ముందుకొచ్చింది.

కొద్దిరోజుల క్రితం ఉత్తరకొరియాను తమ అదుపులో పెట్టుకోవడానికి ఎలాంటి సాహసం చేయడానికి వెనకాడబోమని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబాన్ నాయకుడు ఒసామాబిన్ లాడెన్ ను చంపిన అమెరికా సైనికలు సీల్ టీమ్ -6 బృందంతో కిమ్ ను చంపేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా 17వేల సైనిక దళాలు ఉత్తరకొరియా సరిహద్దుల్లోకి చొరబడ్డాయి. దీనిపై ఆ దేశ మీడియా స్పందించింది. ట్రంప్..కిమ్ ను చంపేందుకు కుట్రచేస్తున్నాడని కథనాల్ని పుంకాలుపుంకాలుగా రాసింది. దీనికి ముందస్తుగానే ప్రణాళికలు వేస్తున్న అమెరికా నౌకాదళ కమాండర్ గేరీ రోజ్ తోసిపుచ్చారు. మిలిటరీ డ్రిల్ కోసమే తాము దక్షిణ కొరియాకు ఈ సైన్యాన్ని తరలించామని  పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెద్దన్న దేశం చేస్తున్న హెచ్చరికలతో కిమ్ భయపడ్డట్లు తెలుస్తోంది. ప్రతిసారి ఎదురు దాడి చేసి నియంత అమెరికా తీరును ఎండగట్టలేకపోతున్నాడు. దీనికికారణం కూడా కిమ్ భయమేనని చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here