పవన్ ఫాన్స్ కి సూపర్ న్యూస్ .. త్రివిక్రమ్ ఫాస్ట్ గా

హీరో పవన్ కళ్యాణ్ – డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే వీరిద్దరి కాంబినేషన్ అదరహో అన్నట్టు ఉంటుంది. ఐదారు నెలల పాటు త్రివిక్రమ్ ఏ హీరో కీ డేట్స్ ఇవ్వకుండా పవన్ కోసమే ఏ సినిమా లేకుండా ఆగిపోయాడు అంటే అది వారిద్దరి మధ్యనా ఉన్న ఫ్రెండ్ షిప్ కి గుర్తు. పది రోజుల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది.
ఈ సినిమా షూటింగ్ లో భారీ తారాగణం ఎండలో ఫిలిం సిటీ లో పాల్గొంటున్నారు. ఫిలిం సిటీ లోని ఒక హోటల్ లో వీరికి బస ఏర్పాటు చేసి త్రివిక్రమ్ షూటింగ్ ని చకా చకా లాగిస్తున్నాడట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సూపర్ గా జరగడం తో త్రివిక్రమ్ ఫాస్ట్ గా సీన్ లు లేపెస్తున్నాడు అంటున్నారు. ఇదే వేగం కొనసాగితే సెప్టెంబర్‌లో వస్తుందని అనుకున్న సినిమా ఆగస్టుకే రెడీ అయిపోతుందని అంటున్నారు. పవన్ ఫాన్స్ కి ఇది అద్భుతమైన వార్త అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here