అట్టర్ ప్లాప్ డైరక్టర్ తో రవితేజ మరోసినిమా

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందా?ఇప్పటికే కథా చర్చలు జరిగినట్టు..త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్లు సమాచారం.  గతంలో వీరి కాంబినేషన్ లో వెంకీ సినిమా వచ్చి సూపర్ సక్సెస్ అయింది.. మళ్లీ ఇప్పుడు కాంబినేషన్ రిపీట్ అవుతున్నట్లు తెలుస్తోంది.
బ్రూస్ లీ, ఆగడు, మిస్టర్’ వంటి వరుస పరాజయాలతో బాగా వెనుకబడ్డ దర్శకుడు శ్రీను వైట్ల రీ ఎంట్రీ ఇచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తునాడని,. కానీ ఒకదాని వెంట ఒకటిగా వచ్చిన ఫ్లాపులు ఇబ్బందిపెడుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఆయన చేతిలో ఏ ప్రాజెక్ట్ ఒక్కటి కూడా లేదు. ఇలాంటి పరిస్థితిలో  హీరో రవి తేజ శ్రీను వైట్లతో సినిమా చేసేందుకు సిద్దమయ్యారట.
గతంలో వీరిద్దరి కాంబోనేషన్లో వచ్చిన ‘వెంకీ, దుబాయ్ శీను’ వంటి హిట్ సినిమాలు వచ్చాయి. ఈ రిలేషన్ తోనే వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేయనున్నారట. ప్రస్తుతానికి ఈ మాస్ మహరాజ్ ‘టచ్ చేసి చూడు’తో వివి వినాయక్ శిష్యుడు విక్రం సిరికి డైరెక్టర్‌గా,పటాస్’, ‘సుప్రీమ్’ లాంటి హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడితో ‘రాజా ది గ్రేట్’ చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here