ఆదిపత్యపోరులో అమెరికా, ఉత్తరకొరియా దేశాలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ విమర్శలపై రష్యా వ్యంగ్యంగా స్పందించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కింగ్ జాంగ్ ఉన్ లు నర్సరీ పిల్లల్లా పోట్లాడుకుంటున్నారని ఆదేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరకొరియాపై దాడులు చేస్తాం., యుద్ధాలు చేస్తామని ప్రగరల్భాలు పలుకుతున్న అమెరికా ఉత్తరకొరియాను ఏం చేయలేదని , ఆ దేశం దగ్గర అణుబాంబులు ఉన్నాయనే విషయం ట్రంప్ కు తెలుసని అన్నారు. అంతేకాదు తాము కిమ్ మద్దతు పలకడంలేదని, వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. వీరిద్దరు పోట్లాడుకోవడం మానేసి అమాయక ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు రోవ్.
