వైసీపీ ఎమ్మెల్యేగా అక్కినేని నాగార్జున..?

అక్కినేని నాగార్జున ప్రస్తుతం సినిమాలతో చాలా బిజిగా వున్నాడు..ఒక వైపు తన కొడుకులను మంచి ఫామ్ లోకి తేవడానికి బాగానే కష్టపడుతున్నాడు..ఇదిలా వుంటే ఇప్పుడు నాగ్ పై సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది..
నాగార్జున ప్రస్తుతం రాజుగారి గది2 సినిమా చేస్తున్నాడు.. దాంతో పాటు మరో సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ చేసుకుంటునే.. నాగ చైతన్య, చందు మొండేటి సినిమా పై దృష్టి పెట్టాడు..
ఇక మరో వైపు అఖిల్..విక్రమ్ కె కుమార్ తో చేసే సినిమా పై కూడ దృష్టి పెట్టాడు..మొత్తానికి నాగ్ సినిమాలతో బిజీగా వున్నాడు.. ఇక మరో వైపు నాగ చైతన్య పెళ్ళి కూడ అక్టోబర్ లో చేయడానికి అన్ని కార్యక్రమాలు సిద్దం చేసుకుంటున్నాడు..
ఇదిలా ఉంటే  నాగ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది..అదే ..నాగ్ త్వరలో పాలిటీక్స్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాడని..2019 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటి చేయబోతున్నాడని
నాగ్ గతంలో వైఎస్ ఆర్ ను బాగానే అభిమానించేవాడు… అంతే కాదు వ్యాపార పరమైన సంబంధాలు కూడ వున్నాయి.. దీంతో నాగ్ త్వరలోనే వైఎస్ ఆర్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నట్లు న్యూస్ వినిపిస్తుంది..తెలంగాణ టీడీపీ పార్టీ చాలా సార్లు నాగ్ బిజినెస్, ల్యాండ్స్ పై విమర్శలు చేస్తుండటంతో నాగ్ టీడీపీ పార్టీని దూరం పెట్టి వైఎస్ ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారంటున్నారు.. కానీ నాగ్ సినిమాలు ,వ్యాపారాలు తప్ప రాజకీయాలు ఇష్టం లేదని నాగ్ సన్నిహితులు చెబుతున్నారు.. నాగ్ కేవలం ఓటు వేయడానికి మాత్రమే పరిమితం కానీ.. రాజకీయాల్లో కి రావడానికి మాత్రం ఆసక్తి చూపటం లేదంటున్నారు. మరి దీనిపై నాగ్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here