క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ హీరోయిన్ గా బాలీవుడ్ కు పరిచయం కానుంది. చదువులో, సమాజ సేవలో ముందుండే సారాకు యాక్టింగ్ అంటే మక్కువట. ఆ మక్కువతోనే సినిమాలో రంగప్రవేశం చేయాలని భావిస్తుందట. అయితే సారాను మాత్రం బాలీవుడ్ కు పరిచయం చేసేందుకు మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్ కకంణం కట్టుకున్నారు.
సారా ఎంట్రీ అదిరిపోయేలా రణ్ బీర్ కపూర్, రణ్ వీర్ సింగ్ సరసన నటించేలా ప్రయత్నాలు చేస్తున్నాడట అమీర్. అదే నిజమైతే అటు క్రికెట్ అభిమానులు ఇటు సినీ అభిమానులు పండగ చేసుకోవడం గ్యారంటీ
