ఒక్క సినిమాకే సాయిపల్లవికి పొగరెక్కువైంది

చేసిన ఒక్క సినిమాకే సాయిపల్లవికి పొగరెక్కువైందని సినీ జనాలు గుసగుసలాడుతున్నారు.
దిల్ రాజు నిర్మాత గా సాయిపల్లవి మొదటి సినిమా ఫిదా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. అదే ఊపులో దిల్ రాజు నిర్మాతగా నానీ హీరోగా ఎంసిఎ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి సాయిపల్లవిని హీరోయిన్ గా సెలక్ట్ చేసుకున్నారు. కాకపోతే ఈ సినిమా ఘూటింగ్ సమయంలో  సాయిపల్లవికి, నాని పెద్ద గొడవ జరిగిందట.
డైలాగుల విషయంలో అలా చెప్పొద్దు అని నాని, సాయిపల్లవికి సలహా ఇచ్చాడట. దీనికి చిర్రెత్తిపోయిన సాయిపల్లవి న్యాచురల్ స్టార్ ని బండబూతులు తిట్టేసిందట. అందుకు ఒక్క సినిమాకే ఫోజులు బాగా ఎక్కువయ్యాయే.. ఇంకా సినిమాలు తీయాలమ్మా.. అంటూ నాని కూడా బాగానే స్పందించాడట.
ఇది కాస్త పెద్దదై  ఘూటింగ్ నుంచి బయటకు వెళ్లడం, వివాదం దిల్ రాజుకు దగ్గరకు రావడం, ఆయన పరిష్కరించి సాయిపల్లవికి సర్ధి చెప్పడం జరిగింది. అయినా వెనక్కి తగ్గని సాయిపల్లవి నాని పై గుర్రుగా ఉందట. సినిమా విషయంలో నాని వెనక్కి తగ్గి షూటింగ్ కు వస్తున్నాడట. సాయిపల్లవి మాత్రం కొద్దిరోజులు తరువాత షూటింగ్ కు వెళ్లినట్లు రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ గొడవ దిల్ రాజు ఎంత జాగ్రత్త పడినా విషయం భయటకు రావడంతో సినీజనాలు సాయిపల్లవిని తిట్టిపోస్తున్నారట. ఒక్కసినిమాతో పొగరెక్కువై తే కష్టం. జాగ్రత్త ఉండాలంటూ సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here