బాబు బాగా బిజీ సినిమాని తప్పుగా అర్ధం చేసుకోకండి – అవసరాల శ్రీనివాస్

బాబు బాగా బిజీ సినిమా ఇవాళ థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ చిత్రం కి సంబంధించి టీవీ లలో ప్లే అవుతున్న యాడ్ లు చూస్తుంటే ఇది ఖచ్చితంగా అడల్ట్ సినిమా అని చెప్పచ్చు . ట్రైలర్ లో సైతం స్ట్రిక్ట్ ఫర్ అడల్ట్స్ అంటూ మేకర్ లే ఏ సర్టిఫికేట్ సినిమా అని ఓపెన్ గా చెప్పేశారు. సెన్సార్ నుంచి బయటకి రావడానికి సైతం ఈ చిత్ర నిర్మాతలు చాలా ఇబ్బందులు పడినట్టు చెబుతున్నారు. కొన్ని సీన్ లు శృతి మించిపోయి ఉన్నాయి అనే వాదన కూడా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ సినిమాను అడల్ట్ మూవీగా భావించవద్దని కోరాడు.” నిజ జీవితం లో జరిగే సన్నివేశాలు నిజాయతీ గా చూపించే ప్రయత్నం చేసాం మేము. వ్యక్తిగత జీవితానికి దీన్ని ఆపాదించుకోవడం . లేదా సినిమాని అడల్ట్ సినిమాగా చూడడం చాలా ఇబ్బందికర విషయం. ఫుల్లు కామెడీ తో పాటు ప్రేమలు కథలూ హాస్యం అన్నీ నిండి ఉన్న చిత్రం ఇది ” అన్నారు అవసరాల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here