డెసిషన్ మేకర్ గా మారబోతున్న కెసిఆర్

రాష్ట్రపతి ఎన్నికల టైం దగ్గర పడుతోంది. ఒక పక్క విపక్ష పార్టీలు అన్నింటినీ దగ్గరకి తెచ్చి బీజేపీ మీద పోరాటం చెయ్యాలి అని కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉంటె దక్షిణాది లో కీలక రాష్ట్రం అయిన తెలంగాణా విషయమే ఎటూ అర్ధం కావడం లేదు. కేంద్రంలోని మోదీ సర్కారుతో స్నేహపూర్వకంగా ఉంటున్నామన్న సంకేతాలను ఇప్పటికే పలుమార్లు పంపిన కేసీఆర్, రాష్ట్రపతి ఎన్నికలను ప్రభావితం చేసేంత ఓట్లను కలిగివున్నారు.

నోట్ల రద్దును నరేంద్ర మోదీ ప్రకటించిన వేళ, ఆ నిర్ణయానికి కేసీఆర్ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ప్రణబ్ జూలై మాసం లో పదవీ విరమణ చేస్తారు. బీజేపీ నిలిపే అభ్యర్ధి మీద అందరికీ ఏకాభిప్రాయం రాకపోతే మరొక అభ్యర్ధి ని పట్టుకొచ్చి ఎన్నికలు పెడతారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం, విపక్షాలను పక్కన బెడితే, తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి బీజేపీ 25 వేల ఓట్ల దూరంలో ఉంది. టీఆర్ఎస్ కు 22 వేల ఓట్లు ఉండగా, ఆపార్టీ అధినేత కేసీఆర్ డెసిషన్ మేకర్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here