లారెన్స్ కోసం సూపర్ కథ రాసిన బాహుబలి రైటర్ :

దేశం లోనే మోస్ట్ వాంటెడ్ రైటర్ గా మారిపోయారు విజయేంద్ర ప్రసాద్. వరసగా భాజరంగీ భాయ్ జాన్ , బాహుబలి 1, 2 ఇలా సూపర్ విజయాలతో దూసుకుపోతున్న ఆయన ప్రస్తుతం తమిళం లో విజయ్ కి ఒక కథ రాసారు. స్క్రీన్ ప్లే కూడా చేస్తున్నారు. దీని తరవాత మరొక తమిళ చిత్రానికి స్క్రిప్ట్ ఇవ్వబోతున్నారు అని తెలుస్తోంది. ఈ సినిమాలో లారెన్స్ హీరోగా నటిస్తాడు అంటున్నారు.

విజయేంద్ర ప్రసాద్‌తో పాటు రాజమౌళి దగ్గర శిష్యరికం చేసిన మహదేవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. మిత్రుడు అనే బాలకృష్ణ సినిమాతో తెలుగు లో డైరెక్టర్ గా అరంగేట్రం చేసిన మహదేవ్ భారీ ప్లాప్ అందించాడు. అతనిమీద కాకుండా విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన కథ మీదనే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట హీరో లారెన్స్.మరోవైపు విజయేంద్ర ప్రసాద్ తన కొడుకు రాజమౌళి కొత్త చిత్రానికి స్క్రిప్టు రెడీ చేయాల్సి ఉంది.

ఇప్పటికే ఆయన రాసిన కథల్లోంచి ఒకదాన్ని రాజమౌళి ఎంచుకుంటే.. దాన్ని పూర్తిస్థాయి స్క్రిప్టుగా తీర్చిదిద్దే పనిలో పడతారాయన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here