ఎంపీ కొడుకు .. థియేటర్ లో ఆమెని చెయ్యి పట్టుకుని లాగాడు :

ప్రజలు ఛీ కొట్టి అధికారం లోనుంచి కిందకి దింపేసినా కూడా కొందరు వెధవ వేషాలు వేస్తూ వెధవలు గానే ఉంటారు . ప్రజలు తిరస్కరించినా కూడా ఇంకా తప్పుడు పనులు చేస్తూ ఇంకా తమ ప్రతిష్ట దిగ జార్చుకుంటారు. చెన్నయ్ లోని తాండయార్ పేట లో జరిగిన ఒక సంఘటన సంచలనం రేపింది. మాజీ ఎంపీ.. ప్ర‌ముఖ ర‌చ‌యిత వ‌లంపురి జాన్ కుమారుడు కిర‌ణ్ ప్ర‌భు. ఇత‌గాడు హైకోర్టులో లాయ‌ర్ గా ప‌ని చేస్తుంటాడు. చ‌ట్టం గురించి అవ‌గాహ‌న ఉన్న‌ప్ప‌టికీ.. వెధ‌వ పనుల‌కు పాల్ప‌డ్డాడు.

తాజాగా త‌న స్నేహితుడు భ‌ర‌తబాబుతో క‌లిసి ఓ సినిమా థియేట‌ర్ కు వెళ్లాడు. సినిమా హాల్ లో తన పక్కన కూర్చున్న మహిళ ని అరుస్తూ ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఆ మహిళ వెంటనే లేచి బయటకి వెళ్ళే ప్రయత్నం చెయ్యగా ఆమె పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఆమె చెయ్యి పట్టుకుని లాగాడు. వెంటనే ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి మాజీ ఎంపీ కుమారుడు.. అత‌గాడి స్నేహితుడ్ని పోలీసులు విచారించి.. అనంత‌రం అరెస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here