శాతకర్ణి తరవాతా సైలెంట్ గా వస్తున్నాడు .

సైలెంట్ గా తన కొత్త సినిమాని మొదలు పెట్టేసాడు డైరెక్టర్ క్రిష్. గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి భారీ సినిమాతో అతిపెద్ద హిట్ కొట్టేసిన డైరెక్టర్ క్రిష్ ఈ సారి అంతకంటే ఎక్కువ భారీ స్థాయి లో ఝాన్సీ లక్ష్మీ బాయ్ కథనే తెరమీద ఆవిష్కరణ చేస్తున్నారు. మణికర్ణిక అని దీనికి టైటిల్ పెట్టి కంగన రనౌట్ ని ప్రధాన పాత్రకి తీసుకున్నాడు ఈయన. ఈ చిత్రానికి చారిత్రిక నేపధ్యం కి తోడైన కాసీ లో గురువారం షూట్ స్టార్ట్ చేసారు.

ఈ సినిమాకి పని చేసిన నిపుణులు , ప్రధాన తారాగణం అంతా వారణాసి కి చేరుకొని లోగో కార్యక్రమం అట్టహాసం గా చేసారు. సాయంత్రం టైం లో గంగ దగ్గర ఇరవై అడుగుల మణికర్ణిక లోగో పోస్టర్ ఆవిష్కరణ చేసారు. లోగో పోస్ట‌ర్‌తో పాటు దాన్ని లాంచ్ చేసిన తీరు కూడా బాగుంద‌ని క్రిష్‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.
ఈ కార్య‌క్ర‌మంలో క్రిష్‌తో పాటు హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్, సంగీత ద‌ర్శ‌కులు శంక‌ర్-ఎహ‌సాన్-లాయ్‌.. ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్.. నిర్మాత‌లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

బాహుబలి కథా రచయత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి ఇచ్చిన కథ ప్రధాన హై లైట్ గా ఈ సినిమా సాగాబోతోంది అంటున్నారు. క్రిష్ కంటే ముందరే డైరెక్టర్ కేతన్ మెహతా ఝాన్సీ ల‌క్ష్మీబాయి క‌థ‌తో సినిమా తీయాల‌నిఆశించాడు. కానీ ఈలోపే క్రిష్ రంగంలోకి దిగిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here