కమల్ హాసన్ అట్టర్ ప్లాప్ సినిమా హాలీవుడ్ లో ..

రెండు సంవత్సరాల క్రితం విడుదల అయిన ఉత్తమ విలన్ సినిమా విమర్శకుల ప్రసంసలు అందుకుంది. కమర్షియల్ గా భారీ డిజాస్టర్ అయిన ఈ చిత్రం కమల్ అభిమానులకి మాత్రం బాగా నచ్చింది. ఆయన కెరీర్ లో అతిగొప్ప చిత్రంగా ఇది మిగిలిపోతుంది అని ఈ చిత్రం చూసిన ఎవరైనా చెబుతారు. హాలీవుడ్ లో ఈ చిత్రాన్ని రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
జూలై 9 ఈ సినిమాని అక్కడ విడుదల చేస్తున్నారు. అయితే మొన్నటి వరకూ ఈ చిత్రం రీమేక్ ఉత్తమ విలన్ నుంచి వచ్చింది అని ఎవ్వరికీ తెలీదు. హీరో అనే సినిమా విడుదల కి సిద్దం అవుతూ ఉండగా ఇది ఇండియన్ చిత్రం ఉత్తమ విలన్ నుంచే వచ్చింది అని తాజాగా డైరెక్టర్ చెప్పాడు. వికీ పీడియా లో కూడా రచన క్రెడిట్ ని కమల్ హాసన్ కి ఇచ్చారు. హీరో మూవీకి ఇప్ప‌టికే కొన్ని చోట్ల ప్రిమియ‌ర్లు కూడా వేశారు.
వాటికి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇండియన్ సినిమాకి ఇంటర్నేషనల్ స్థాయి తెచ్చాడు అంటే కమల్ ని మెచ్చుకోవాల్సిందే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here