తండ్రి చిత్రంలో నటించేది తనయుడే..!

శ్రీకాంత్‌ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన పెళ్లి సందడి సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.  ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈసినిమా విడుదలైన దాదాపు 21 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కుతున్నట్లు రాఘవేంద్రరావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోగా ఎవరు నటించనున్నారన్న దానికి తాజాగా చిత్ర యూనిట్‌ తెరతీసింది. సినిమా ప్రకటించిన నాడు వచ్చిన వార్తలను నిజం చేస్తూ హీరో శ్రీకాంత్‌ ఓ వీడియోను విడుదల చేశాడు.

పెళ్లి సందడి సీక్వెల్‌లో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటించనున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. రోషన్‌ను హీరోగా ప్రకటిస్తూ రూపొందించిన ఓ వీడియోను శ్రీకాంత్‌ ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశాడు. రోషన్‌ గతంలో నాగార్జున నిర్మాణంలో తెరకెక్కిన నిర్మలా కాన్వెంట్‌ చిత్రంతో ప్రేక్షకులను పరిచయమయ్యాడు. ఇక ఇప్పుడు తండ్రి నటించిన పెళ్లి సందడి సీక్వెల్‌తో మరోసారి మ్యాజిక్‌ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రోషన్‌ తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. పెళ్లి సందడితో రోషణ్‌ పూర్తి స్థాయి హీరోగా మారనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మిస్తుండగా..గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నాడు. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here