సిరీస్‌ చూశాక ఆ పేరు ఎందుకుపెట్టామో మీకే అర్థమవుతుంది..!

చాలా రోజుల తర్వాత మళ్లీ తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నారు నటి, రచయిత, దర్శకురాలు రేణు దేశాయ్‌. బద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రేణు అనంతరం జానీ సినిమా తర్వాత పూర్తిగా వెండితెరకు దూరమైంది. ఇక తాజాగా దర్శకురాలిగా మారి మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే చాలా కాలం తర్వాత రేణు మళ్లీ స్క్రీన్‌పై కనిపిస్తోంది. ‘ఆద్య’ పేరుతో తెరకెక్కుతోన్న వెబ్‌ సిరీస్‌లో రేణు ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇటీవలే ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ను ప్రారంభించారు.

ఇక ఈ సందర్భంగా అసలీ వెబ్‌సిరీస్‌కు ‘ఆద్య’ అనే పేరు ఎందుకు పెట్టారని ప్రశ్నించగా ఆసక్తికరమైన సమాధానం చెప్పింది రేణు. రేణు దేశాయ్‌-పవన్‌ కళ్యాణ్‌ల కుమార్తె పేరు కూడా ఆద్య అనే విషయం తెలిసిందే. ఇక సిరీస్‌కు ఆద్య పేరు ఎందుకుపెట్టారన్న ప్రశ్నకు బదులిస్తూ..‘ఈ సిరీస్‌కు ఆద్య పేరు  పెట్టాలని ముందుగా ప్లాన్ చేసుకోలేదు.. ఇది పూర్తిగా యాదృచ్చికంగా జరిగింది.. వాస్తవానికి సిరీస్ కి ‘ఆద్య’ అనే టైటిల్ నిర్మాత డిఎస్ రావు సూచించారు. ఇక నా కుమార్తకు ఆద్య అనే పేరు ఎందుకు పెట్టామంటే.. ‘ఆద్య’ అంటే ‘మహా సరస్వతి’ ‘మహా లక్ష్మి’.. ఆదిశక్తికి ప్రతీక అయిన మహా కాళి అని అర్ధం. మీరు ఈ సిరీస్‌ను చూసిన తర్వాత ‘ఆద్య’ అని ఎందుకు పేరు పెట్టారో మీకు అర్థమవుతుంది’ అని రేణు చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here