పెద్దకుమార్తె సక్సెస్ అవ్వకపోతే రెండవ కుమార్తె?: శ్రీదేవి

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి పెద్ద కుమార్తెని జాన్వీ క‌పూర్  సినిమా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్య పరిచింది శ్రీదేవి. ఈ క్రమంలో  `ధ‌డ‌క్‌` సినిమాతో తన కూతురు జాన్వీ క‌పూర్ ని బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది శ్రీదేవి. ఈ సినిమా మీద అంచనాలు బానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ పూర్తవుతున్న నేపథ్యంలో శ్రీదేవి తన పెద్ద కూతురుతో  జాన్వీ క‌పూర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం.
అయితే ఈ క్రమంలో శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ క‌పూర్ కూడా సినిమా ఎంట్రి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అంటున్నారు కొంతమంది బాలీవుడ్ జనాలు…..దానికి తగ్గట్టుగానే ప్రతి ఫంక్షన్ కార్యక్రమంలో తన తల్లి శ్రీదేవితో పాటు ఖుషీ క‌పూర్ కూడా హాజరవుతూ అందరి కళ్ళల్లో పడుతుంది. ఇట్టివల సోన‌మ్ క‌పూర్ క‌జిన్ పెళ్లి వేడుక‌లో ఖుషీ క‌నిపించిన తీరు చూస్తే ఎవ‌రైనా ప‌రేషాన్ అయిపోవాల్సిందే.
ఈ నేపథ్యంలో శ్రీదేవి రెండవ కుమార్తె ఖుషీ క‌పూర్ ని కూడా శ్రీదేవి తీసుకొస్తుంది అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం పెద్దకుమార్తె జాన్వీ క‌పూర్ సినిమా ఇండస్ట్రీలో రాణించకపోతే రెండవ కుమార్తె ఖుషీ క‌పూర్ తో ప్రయోగం చేస్తుంది అంటున్నారు శ్రీదేవి సన్నిహితులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here