బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టిన రెజినా?

టాలీవుడ్ గ్లామర్ హాట్ భామ రెజినా కాసాండ్రా కు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. గత కొంతకాలంగా వరుస పరాజయాలతో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో రెజినా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయితే ఈ క్రమంలో మున్నాభాయ్ ఎం బి బి ఎస్, 3 ఈడియెట్స్ లాంటి సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత విధు వినోద్ చోప్రా సినిమాలో రెజినా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.అయితే ఈ సినిమాకు ముందే ఓ బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయింది రెజినా.
అయితే ఆ సినిమా షూటింగ్ మొదలు పెట్టకముందే ఆగిపోయింది. తాజాగా రెజినా నటిస్తున్న సినిమాలో రాజ్ కుమార్ రావు, సోనమ్ కపూర్ లు నటిస్తున్నరట. మొత్తంమీద రెజినా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సరైన నటులున్నా సినిమాతో. ఒకవేళ సినిమా హిట్ అయితే మాత్రం రెజినా బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ అయిపోతుంది అంటున్నారు సినిమా విశ్లేషకులు.
 
 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here