బాలీవుడ్ ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన హీరోలు? : ప్రియా ప్రకాశ్ వారియర్

తన కనుసైగలతో యావత్ భారతదేశాన్ని తనవైపు తిప్పుకొన మలయాళ ముద్దు గుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. కేవలం చిన్న ఎక్స్ప్రెషన్ తో దేశంలో  సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టించిన ప్రియా ప్రకాశ్ వారియర్….ఓవర్‌నైట్‌లో పెద్ద పాపులర్ స్టార్ అయిపోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీ మీద తన మనసులో ఉన్న మాటను బయటపెట్టింది.

బాలీవుడ్ ఇండస్ట్రీ తనకిష్టమైన స్టార్ల గురించి చెప్పింది బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్‌తో పాటు రణ్‌వీర్ సింగ్, సిద్ధార్ధ్ మల్హోత్రా లాంటి హీరోలంటే తనకు చాలా ఇష్టమని, వారి సరసన అవకాశం వస్తే నటిస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నా ‘ఒరు అదార్ లవ్’ అనే సినిమా మీద భీభత్సమైన అంచనాలు ఉన్నాయి.

ఈ క్రమంలో ప్రియా ప్రకాశ్ వారియర్ విడుదలైన మొదటి వీడియో ఇంకా సోషల్ మీడియాలో అనేక సంచలనాలు సృష్టిస్తుంది ప్రస్తుతం ఈ వీడియోకు యూట్యూబ్‌లో ఏకంగా 80 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో ప్రియా వారియర్‌ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here