చంద్రబాబునాయుడు పై సంచలనకరమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి మాణిక్యాలరావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏపీ బిజెపి నేతలు ఆడేసుకుంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మంత్రి అయిన దేవాదాయ శాఖ మంత్రి బిజెపి నాయకుడు మాణిక్యాలరావు చంద్రబాబు నాయుడు మీద సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలలో టిడిపి అధికారంలోకి రావడానికి కొంత కీలకపాత్ర పోషించిన బీజేపీ ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీని ఏకిపారేస్తుంది.

తాజాగా ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ విషయంలో కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని మోసం చేసిందని తెలుగుదేశం పార్టీ నాయకులు అధినేత చంద్రబాబునాయుడు బిజెపి పార్టీని రాష్ట్రంలో దోషిగా కను పరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా బిజెపి పార్టీ నుండి బయటికి వచ్చేస్తే  రాష్ట్రానికి మేలు జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు బిజెపి ని. ఈ నేపథ్యంలో మంత్రి మాణిక్యాల రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్న తమ పార్టీ నుండి టీడీపీ విడిపోతే మాకు వెంట్రుక అంత నష్టం కూడా ఉండదు.

కాకపోతే చంద్రబాబుకు మాత్రం మిగిలేది బూడిదే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే బడ్జెట్  సమావేశాలకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశారో తెలియజేయడానికి అరుణ్ జైట్లీ ని రాష్ట్రానికి తీసుకొస్తామని అన్నారు మంత్రి  మాణిక్యాలరావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here