స్పైడర్ రివ్యూ వచ్చేసింది

సినిమాల విడుదలకు ముందే వాటి రివ్యూ, రేటింగ్స్ చెప్పేసే సెన్సార్ బోర్డు సభ్యుడు, మూవీ మార్కెటింగ్ నిపుణుడు ఉమైర్ సంధు, మహేష్ బాబు తాజా చిత్రం ఫస్ట్ రివ్యూ, తన రేటింగ్ ను సోషల్ మీడియా ఖాతాల్లో ఇచ్చేశారు. ఈ చిత్రం అద్భుతంగా ఉందని ప్రశంసించిన ఆయన, ఇది చక్కగా తయారు చేసిన థ్రిల్లర్ చిత్రమని అన్నారు.
ఈ చిత్రానికి 3.5 రేటింగ్ ఇచ్చిన ఉమైర్ సంధూ, కనిపించకుండా ఘోరాలు చేసే విలన్ ను కనిపెట్టి, ఆట కట్టించే పాత్రలో మహేష్ నటన అద్భుతమని అన్నారు. విలన్ ఎవరో కనిపెట్టేందుకు వేసే ఎత్తులు, పై ఎత్తులు అలరిస్తాయని చెప్పారు. చిత్రంలో క్లైమాక్స్ అత్యుత్తమమని, ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేస్తుందని చెప్పారు. అటు క్లాస్ ను, ఇటు మాస్ ను అలరించే విధంగా తయారైన ‘స్పైడర్’, ఈ దసరాకు బ్లాక్ బస్టరేనని తేల్చారు.
విలన్ గా సూర్య, హీరోయిన్ రకుల్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చెప్పుకొచ్చారు. కాగా, ఇటీవల విడుదలైన ‘జై లవకుశ’ ఫస్ట్ రివ్యూలో కూడా ఉమైర్ సంధూ 3.5 రేటింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here