నేను రిక్వస్ట్ చేసినా ఎన్టీఆర్ ఒద్దు అన్నాడు .. సరే అని వదిలేసా – బాబీ చెప్పిన లవ కుస నిజాలు

‘జై లవ కుశ’ సినిమా సెట్స్ పైకి రాక మునుపే ఈ సినిమాలో ‘జై’ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్టుగా చెప్పారు. ‘జై’ పాత్రకి ప్రత్యేకమైన మేకప్ చేయించడానికి హాలీవుడ్ నుంచి మేకప్ నిపుణులను హైదరాబాద్ కి రప్పించామని అన్నారు. ‘జై’ లుక్ ఇలా వుండబోతోందంటూ ఒక ‘మాస్క్’ తాలూకు ఫోటో నెట్లో హల్ చల్ చేసింది. అయితే సినిమాలో ‘జై’ ప్రత్యేకమైన మేకప్ తో కనిపించలేదు. హెయిర్ స్టైల్ .. కాస్ట్యూమ్స్ విషయంలో కొత్తదనం చూపించారంతే.
ఇదే విషయాన్ని గురించిన ప్రశ్న తాజాగా బాబీకి ఎదురైంది. ప్రత్యేకమైన మేకప్ తో ‘జై’ లుక్ ను కొత్తగా చూపించాలనే ప్రయత్నం చేసిన మాట వాస్తవమేనని బాబీ అన్నాడు. అయితే గెటప్ తో కంటే .. హావభావాలతోనే ‘జై’ పాత్రలో కొత్తదనం చూపించడం మంచిదనే అభిప్రాయాన్ని ఎన్టీఆర్ వ్యక్తం చేశాడని చెప్పాడు. ఎన్టీఆర్ వద్దని చెప్పడంతోనే ‘స్పెషల్ మేకప్’ అనే ఆలోచనను పక్కన పెట్టేయడం జరిగిందని, తనదైన స్టైల్లో ఎన్టీఆర్ ఈ పాత్రలో మెప్పించాడని చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here